Loading...
Ramayana Box Office Collections: ఐదో రోజు కూడా తగ్గని జోరు.. ఒక్కరోజే రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు!
ఐదో రోజు కూడా తగ్గని జోరు.. ఒక్కరోజే రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు!

Ramayana Box Office Collections: ఐదో రోజు కూడా తగ్గని జోరు.. ఒక్కరోజే రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్‌ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సత్తా చాటుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ఐదో రోజు, పోస్ట్‌ దీపావళి రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

వివరాలు

ఐదో రోజు రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు

సోమవారం ఐదో రోజు కూడా 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదో రోజు రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ కలెక్షన్లతో ఐదో రోజున అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా పోస్ట్‌ దీపావళి రోజుల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మరో రికార్డును అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా విజయాన్ని అభిమానులతో పంచుకుంది.

వివరాలు

ఐదు రోజుల్లో రూ.663.90 కోట్ల గ్రాస్

'రామాయణ: పార్ట్‌ 1' ఐదో రోజు భారతదేశంలో రూ.107.50 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది.

దీంతో ఐదు రోజుల్లో దేశీయంగా మొత్తం నెట్‌ కలెక్షన్లు రూ.346.35 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్‌ వసూళ్లు రూ.413.90 కోట్లుగా నమోదయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు

రూ.1,000 కోట్ల క్లబ్‌పై అంచనాలు

ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ 'రామాయణ' అదరగొడుతోంది. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ.250 కోట్ల వసూళ్లు సాధించింది.

దీంతో దేశీయ, విదేశీ కలెక్షన్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.663.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది.

కేవలం ఐదు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడంతో సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్లపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశముంది. రానున్న రోజుల్లో 'రామాయణ' ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

ADVERTISEMENT