Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరక్టర్ దేవా కట్టా
ఈ వార్తాకథనం ఏంటి
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు దేవా కట్టా. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటికే 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ స్పందిస్తూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త సినిమాలకు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది. తాజాగా దేవా కట్టా కూడా ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు ఎలా మొదలయ్యాయో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయడం నా కల. 'రిపబ్లిక్' సినిమా ఆలోచన కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని వచ్చింది. ఒకవేళ మాకు ఇద్దరికీ నచ్చే కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తాం.
వివరాలు
త్వరలోనే పూర్తి వివరాలు
ప్రస్తుతం నేను అద్భుతమైన ప్రతిభ కలిగిన వ్యక్తులతో కలిసి రాజకీయేతర కథను సిద్ధం చేస్తున్నాను. కొత్త ఆలోచనలతో, విభిన్నమైన కథలను అన్వేషిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించిన సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని దేవా కట్టా తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను మరోసారి అభిమానులకు చూపించింది.
వివరాలు
పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా సురేందర్ రెడ్డితోనే
ఇక పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఒక సినిమా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి, పవన్‌కు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఖరారై ఉండటంతో, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా సురేందర్ రెడ్డితోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి