Loading...
This Week Movie Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే!
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే!

This Week Movie Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. శర్వానంద్‌ 'భోగి' నుంచి సుడిగాలి సుధీర్‌ 'G.O.A.T', 'ఇట్లు అర్జున', 'డార్క్‌ చాక్లెట్‌' వరకు పలు చిత్రాలు నవంబరు 12, 13 తేదీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌తో విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం థియేటర్లలోకి రానున్న చిత్రాల వివరాలేంటో తెలుసుకుందాం.

వివరాలు

భోగి

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భోగి'. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది.

బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

G.O.A.T

సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'G.O.A.T' (గోట్‌). వేదవ్యాస్‌ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో కామెడీకి పెద్దపీట వేసినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

అ

రాహుల్‌ విజయ్‌, అర్చన అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అ' (AH). సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు.

విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT

వివరాలు

ఇట్లు అర్జున

అనీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఇట్లు అర్జున'. మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ సినిమాలో అనశ్వర రాజన్‌ కథానాయికగా నటిస్తున్నారు.

అగ్ర నటుడు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబరు 13న థియేటర్లలోకి రానుంది.

ఇందులో హీరో పాత్రను మాటలు రాని వ్యక్తిగా తీర్చిదిద్దడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు

డీఎన్‌కే (దొంగ నా కొడుకు)

'లిటిల్‌ హార్ట్స్‌' చిత్రంలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విజయాన్ని అందుకున్నారు మౌళి.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు). సుష్మితా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు.

నవంబరు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

వివరాలు

చంద్రయాన్

శివకుమార్‌ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రయాన్‌'.

శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించగా.. ప్రవీణ్‌ మొలక నిర్మించారు. లోకేశ్‌, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ నెల 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఎక్కాలు, లెక్కలు కూడా సరిగా రాని ఓ పల్లెటూరికి చెందిన నలుగురు కుర్రాళ్లు రాకెట్‌ తయారు చేసి చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

వివరాలు

రోమియో జూలియట్

'ప్రేక్షకుల్ని ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే ఫన్‌ రైడ్‌ సినిమా రోమియో జూలియట్‌' అంటున్నారు దర్శకుడు భార్గవ్‌ మాచర్ల. హర్షిత్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు.

మయూరి ఫిల్మ్స్‌ ద్వారా నవంబరు 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇందులోని పాత్రలు, కథాంశాలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.

వివరాలు

మాయలేడీ

రాకేష్‌ వర్రే, మధుమిత సర్కార్‌ జంటగా నటించిన చిత్రం 'మాయలేడీ'. ప్రశంకర్‌ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా కూడా నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. గర్ల్‌ఫ్రెండ్‌లోని విభిన్న భావోద్వేగాలను క్రిష్‌ అనే యువకుడు ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికరమైన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు.

డార్క్‌ చాక్లెట్‌

విశ్వదేవ్‌ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డార్క్‌ చాక్లెట్‌'. శశాంక్‌ శ్రీవాస్తవ్‌ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్‌ మీడియా, వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు జానర్లను మేళవిస్తూ, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

వివరాలు

టాల్కమ్‌ పౌడర్

శివ కందుకూరి, ద్రిషికా చందర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టాల్కమ్‌ పౌడర్‌'. సాయినాథ్‌ పొన్నా దర్శకత్వం వహిస్తున్నారు.

రాజ్‌ కందుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలియక చేసిన ఓ తప్పు కారణంగా అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకున్న బంటీ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అతడిని పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు వెంటాడే పరిస్థితులతో కథనం సాగనున్నట్లు ప్రచార చిత్రం వెల్లడిస్తోంది. నవంబరు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జీ5

బ్లైండ్‌ గేమ్‌ (మూవీ) హిందీ నవంబరు 11

నెట్‌ఫ్లిక్స్‌

నెవ్వర్‌ సరెండర్‌ (మూవీ) ఇంగ్లీష్‌ నవంబరు 12

దాయ్‌రా (మూవీ) హిందీ నవంబరు 13

ADVERTISEMENT