Loading...
upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాల దూకుడు.. థియేటర్లు, ఓటీటీలో వినోదవిందు!
ఈ వారం చిన్న చిత్రాల దూకుడు.. థియేటర్లు, ఓటీటీలో వినోదవిందు!

upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాల దూకుడు.. థియేటర్లు, ఓటీటీలో వినోదవిందు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు, హిందీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటిటిలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి. నాని నిర్మించిన 'కోర్ట్' సినిమా పాత్రల ఎమోషన్‌కి కనెక్ట్‌ అయి, వాటితో నవ్వుతూ, ఏడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ 'కోర్ట్‌' అని చెబుతున్నారు నాని. ఆయన నిర్మాణంలో రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్‌ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.

Details

లవ్ ఎంటర్‌టైనర్‌గా 'దిల్‌ రూబా' 

కిరణ్‌ అబ్బవరం హీరోగా విశ్వకరుణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఎంటర్‌టైనర్ 'దిల్‌ రూబా'. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటించింది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా, చివరికి మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి.. అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్‌కి విలువ ఉండదన్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

వాయిదా తర్వాత 'ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ'

కున్‌చకో బొబన్‌, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం 'ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ'.

క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నకిలీ బంగారు ఆభరణాల కేసు విచారణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది.

Details

 వాస్తవ సంఘటనలతో 'ది డిప్లొమాట్' 

జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో శివమ్‌ నాయర్‌ దర్శకత్వంలో రూపొందిన 'ది డిప్లొమాట్' యాక్షన్‌ డ్రామా మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్‌ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.

'యుగానికి ఒక్కడు' మళ్లీ రాబోతున్నాడు

కార్తికి తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'యుగానికి ఒక్కడు' మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో కార్తీ, ఆండ్రియా, రీమా సేన్‌ నటించిన ఈ చిత్రం 2010లో మంచి విజయాన్ని సాధించింది. మార్చి 14న మరోసారి తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది.

ADVERTISEMENT

Details

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లివే

- సోనీలివ్‌

ఏజెంట్‌ (తెలుగు) - మార్చి 14

- నెట్‌ఫ్లిక్స్‌

అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) - మార్చి 10

అమెజాన్‌ ప్రైమ్‌

వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 (వెబ్‌సిరీస్‌) - మార్చి 13

బీ హ్యాపీ (హిందీ) - మార్చి 14

జీ5

ఇన్‌ గలియోంమే (హిందీ) మార్చి 14

ఆపిల్‌ టీవీ ప్లస్‌

డోప్‌థీప్‌ (వెబ్‌సిరీస్‌) - మార్చి 14

ఈటీవీ విన్‌

పరాక్రమం (తెలుగు) - మార్చి 13

రామం రాఘవం (తెలుగు) - మార్చి 14

ADVERTISEMENT