LOADING...
Dhanush - Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్ మధ్య వైరల్‌ అవుతున్న మృణాల్‌-ధనుష్‌ కామెంట్స్‌!
డేటింగ్‌ రూమర్స్ మధ్య వైరల్‌ అవుతున్న మృణాల్‌-ధనుష్‌ కామెంట్స్‌!

Dhanush - Mrunal Thakur: డేటింగ్‌ రూమర్స్ మధ్య వైరల్‌ అవుతున్న మృణాల్‌-ధనుష్‌ కామెంట్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ధనుష్‌-మృణాల్‌ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. సినీ ఇండస్ట్రీ ఈవెంట్లు, పార్టీల్లో వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడం, పబ్లిక్‌గా కూడా కలిసి హాజరుకావడం వంటి పరిణామాలు ఆ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. తాజాగా వీరిద్దరి సోషల్ మీడియా ఇంటరాక్షన్ మరలా ఈ వార్తల్ని వైరల్‌గా మారేలా చేసింది. మృణాల్‌ తాజాగా తన కొత్త సినిమా 'దో దీవానే షెహర్‌ మే' టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌కు హీరో ధనుష్‌ స్పందిస్తూ 'టీజర్‌ చాలా బాగుందంటూ కామెంట్ చేశారు. ఆసక్తికరంగా ఆ కామెంట్‌కు మృణాల్‌ 'లవ్‌ సింబల్'తో రిప్లై ఇచ్చింది.

Details

ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి

ఈ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దాంతో మళ్లీ డేటింగ్‌ రూమర్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రెండు నెలల క్రితం ఈ వార్తలపై మృణాల్‌ ఒకసారి స్పందించారు. నా కెరీర్‌లో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిపైనే దృష్టి. ఏం జరుగుతుంది, ఏం జరగదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నా జీవితంలో జరుగుతున్న వాటిని గురించి నిరంతరం చర్చించడం నాకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.