NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి 
    తదుపరి వార్తా కథనం
    నేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి 
    అక్టోబర్ 13వ తేదీన నేషనల్ సినిమా డే ని జరపనున్న మల్టీప్లెస్ అసోసియేషన్

    నేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 21, 2023
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ సినిమా డే రోజున 99రూపాయలకే మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.

    ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన నేషనల్ సినిమా డే ని జరపబోతున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ రోజున మల్టీప్లెక్స్ థియేటర్లలో 99రూపాయలు చెల్లించి సినిమాను చూడవచ్చు.

    ఈ ప్రోగ్రామ్ లో మల్టీప్లెక్స్ దిగ్గజాలైన పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ వంటి థియేటర్లు పాల్గొంటున్నాయి. 99రూపాయలకే రిక్లయినర్ వంటి సీట్లలో కూర్చుని సినిమాను ఆనందించవచ్చు.

    గతేడాది జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబర్ 23వ తేదీన జరిపారు. అయితే అప్పుడు ఒక టికెట్ ధర 75రూపాయలుగా నిర్ణయించారు.

    Details

    తెలుగు రాష్ట్రాల్లో వర్తించని ఆఫర్ 

    జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ అందిస్తున్న ఈ ఆఫర్, తెలుగు రాష్ట్రాల్లో వర్తించడం లేదు.

    గతేడాది కూడా ఈ ఆఫర్ వర్తించలేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మల్టీప్లెక్స్ అసోసియేషన్ నిర్ణయించినట్టుగా 99రూపాయల టికెట్ కాకుండా 112రూపాయలకు మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమాలు చూడవచ్చు.

    ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి సౌకర్యం లేదు.

    2022లో నిర్వహించిన జాతీయ సినిమా దినోత్సవానికి అనూహ్య స్పందన వచ్చింది. సినిమా డే రోజున 6.5 మిలియన్ల మంది మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలను వీక్షించారు. మరి ఈసారి ఎంతమంది వీక్షిస్తారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ నరేంద్ర మోదీ
    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్

    సినిమా

    Happy birthday Ramyakrishna: పాత్రేదైనా, ఘట్టమేదైనా రమ్యకృష్ణ దిగనంత వరకే తెలుగు సినిమా
    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  చిరంజీవి
    కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం  కళ్యాణ్ రామ్
    అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న స్కంద, ఎన్ని లొకేషన్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే  రామ్ పోతినేని

    తెలుగు సినిమా

    జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్  జవాన్
    ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ  వరుణ్ తేజ్
    హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  హాయ్ నాన్న
    జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం: కుటుంబంతో కలిసి వెళ్తున్న ఆర్ఆర్ఆర్ హీరో  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025