NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ
    తదుపరి వార్తా కథనం
    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ

    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 07, 2023
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ సినిమా, వెండితెర మీద ప్రభావం చూపించలేకపోయింది.

    ప్రస్తుతం అశోక్ గల్లా రెండవ సినిమా హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరో వెంకటేష్, దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఇక్కడ విశేషం ఏమిటంటే అశోక్ గల్లా రెండవ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథను అందించాడు. అ, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలను తెరకెక్కించి ప్రస్తుతం హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

    తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న హనుమాన్ సినిమాను, హిందూ పురాణాల్లోని పాత్రల ఆధారంగా రూపొందిస్తున్నాడు.

    అశోక్ గల్లా

    అశోక్ గల్లా సినిమాకు హిందూ పురాణాల టచ్

    ఐతే అశోక్ గల్లా సినిమాను కూడా హిందూ పురాణాల్లోని పాత్రల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అదీగాక ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నాడు కాబట్టి పురాణాలకు సంబంధించిన కథే అయ్యుంటుందని అనుకుంటున్నారు.

    ఎందుకంటే గతంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, హిందూ పురాణాల్లో చాలా పాత్రలు ఉన్నాయని, వాటిని సూపర్ హీరోలుగా తీర్చిదిద్దితే మంచి మంచి సినిమాలు తీయొచ్చని అన్నాడు.

    మరి ఈ సినిమా పూర్తిగా పురాణాలను ఆధారం చేసుకుని ఉంటుందా లేదా వాటి టచ్ మాత్రమే ఉంటుందా అనేది సినిమా షూటింగ్ మొదలైతే గానీ తెలియదు.

    శ్రీలలితాంబికా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న అశోక్ గల్లా రెండవ సినిమాను అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    తెలుగు సినిమా

    శాకుంతలం ప్రమోషన్స్: మల్లికా మల్లికా పాటకు విశేష స్పందన శాకుంతలం
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో సినిమా
    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా? చిరంజీవి
    మనం మనం బరంపురం ట్యాగ్ లైన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం సినిమా

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025