Akhil: 'నా బంగారు తల్లి'.. భార్య జైనబ్‌పై అఖిల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
హీరో అక్కినేని అఖిల్ తన జీవితంలో గత మూడు సంవత్సరాలు ఎన్నో ఒడుదొడుకులతో గడిచాయని, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జైనబ్ ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని భావోద్వేగంగా వెల్లడించారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'లెనిన్' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపిన అఖిల్.. తన కుటుంబం, అభిమానుల గురించి హృదయానికి హత్తుకునేలా మాట్లాడారు.
వివరాలు
'జైనబ్ నా బంగారు తల్లి'
"నేను ఇంట్లో జైనబ్‌ను 'బంగారు తల్లి' అని పిలుస్తాను. గత మూడు సంవత్సరాలుగా నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆమె ఎప్పుడూ నా వెంటే నిలిచింది.
నాకు తోడుగా ఉంటూ ప్రతి అడుగులో ధైర్యం చెప్పింది.
ఒక భార్యగానే కాకుండా, నాకు మార్గనిర్దేశం చేసే గైడ్‌లా కూడా నిలిచిందని అఖిల్ చెప్పారు.
వివరాలు
భావోద్వేగానికి గురైన నాగార్జున
'లెనిన్' విడుదల తర్వాత జరిగిన వేడుకలో తండ్రి నాగార్జునను ఆలింగనం చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ అఖిల్ భావోద్వేగానికి గురయ్యారు.
"ఆ హగ్‌లోనే పదేళ్లుగా నా మనసులో దాచుకున్న భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇన్నేళ్లలో నాన్న ఒక్కసారి కూడా నన్ను తిట్టలేదు.
ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. నాకు ఆయనే సర్వస్వం. తండ్రిలా మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడిలా కూడా ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచారు.
'లెనిన్' సినిమాను తన భుజాలపై మోశారు. అక్కినేని అభిమానులకు మంచి సినిమా అందించాలనే తపనతో ఎంతో కష్టపడ్డారని చెప్పారు.
వివరాలు
అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని కోరుకున్నా
తన అభిమానుల గురించి మాట్లాడిన అఖిల్.. "ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఇలాంటి అభిమానులు దొరుకుతారు. ఫ్యాన్స్ కోసం అయినా ఒక మంచి హిట్ ఇవ్వాలని నేను మా ఆవిడతో ఎప్పుడూ చెప్పేవాడిని అని అన్నారు.
అలాగే తనను నమ్మిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, "నన్ను నమ్మిన ప్రేక్షక దేవుళ్లందరికీ ఒక్కటే మాట చెబుతున్నాను.
నేను విజయంతో కాలర్ ఎగరేయను.. గర్వపడను. 'లెనిన్' విజయంతో నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం ప్రారంభమైంది.
ఇకపై నేను చేయాలనుకున్న యుద్ధాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తానంటూ తన భావాలను వ్యక్తం చేశారు.