Loading...
Tanushree Dutta: నానా పటేకర్‌ వల్లే నా జీవితం నరకం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా!
నానా పటేకర్‌ వల్లే నా జీవితం నరకం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా!

Tanushree Dutta: నానా పటేకర్‌ వల్లే నా జీవితం నరకం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని, తన జీవితంలో ఓ పెద్ద భూతంలా మారారని అన్నారు. ఇప్పుడు ఆ భూతం చనిపోయిందంటూ వ్యాఖ్యానించారు. నానా పటేకర్‌ మరణం తర్వాత సామాజిక మాధ్యమాల్లో తనపై నెగెటివిటీ మరింత పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆయన తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేసినప్పటి నుంచి తన జీవితం నరకంలా మారిపోయిందని వెల్లడించారు.

వివరాలు

2018లో 'మీ టూ' ఉద్యమం వేళ సంచలన ఆరోపణలు

2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'మీ టూ' ఉద్యమంలో భాగంగా తనుశ్రీ దత్తా.. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

2008లో 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో నానా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లేవన్న కారణంతో నానా పటేకర్‌కు క్లీన్‌చిట్‌ లభించింది. తాజాగా నానా పటేకర్‌ మరణం నేపథ్యంలో తనుశ్రీ దత్తా చేసిన పాత ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.

తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. అందులో 'మీ టూ' ఉద్యమం తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు

2018 నుంచి ప్రతిరోజూ నరకాన్ని అనుభవించా

'మీ టూ' ఉద్యమం తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో చాలామందికి తెలియదని తనుశ్రీ దత్తా అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మీ టూ ఉద్యమానికి ముందు నేను వారంలో ఐదు రోజులు పనిచేస్తూ, ప్రపంచమంతా నిర్భయంగా తిరిగేదాన్ని. అప్పుడు నాకు ఎక్కడా భద్రతాపరమైన సమస్యలు ఎదురుకాలేదు.

కానీ మీ టూ తర్వాత నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో బహిరంగంగా చెప్పడం కూడా నా వల్ల కావడం లేదు.

ఆ విషయాలు వింటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. 2018 నుంచి ప్రతిరోజూ నరకాన్ని అనుభవించాను. 2024లో నా కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యేలా చేశారు.

నేను ఎక్కడికి వెళ్లినా రౌడీలు నన్ను వెంబడించేవారని తనుశ్రీ వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

ఒక వ్యక్తితో అందరి అనుభవాలు ఒకేలా ఉండవు

నానా పటేకర్‌ మరణం తర్వాత సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలపైనా తనుశ్రీ స్పందించారు.

కొందరు వ్యక్తులు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారని తాను ఊహించలేదన్నారు. ఒక వ్యక్తితో ప్రపంచానికి ఎదురైన అనుభవాలు వేరుగా ఉండొచ్చని, అదే వ్యక్తితో తనకు ఎదురైన అనుభవాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నారు.

ఒక వ్యక్తితో ప్రపంచానికి ఉన్న అనుభవాలు వేరు కావచ్చు. కానీ ఆ వ్యక్తితో నాకు ఎదురైన అనుభవాలు వేరు. అతడు నన్ను ఒంటరిగా వేధించలేదు.

కొందరితో కలిసి ఒక బృందంగా ఏర్పడి నన్ను హింసించాడు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన అతడు తన జీవితంలో చేసిన నేరాలు, వేధింపులన్నీ మాఫీ అయిపోతాయా అని తనుశ్రీ ప్రశ్నించారు.

ADVERTISEMENT

వివరాలు

ఆయన నన్ను ఎప్పుడూ క్షమాపణ కోరలేదు

నానా పటేకర్‌ను క్షమించాలంటూ కొందరు తనకు సలహాలు ఇస్తున్నారని తనుశ్రీ చెప్పారు. అయితే, ఆయన తనను ఎప్పుడూ క్షమాపణ కూడా అడగలేదని పేర్కొన్నారు.

దేవుడు కూడా క్షమించమని అడగనివారిని మన్నించడు. కాబట్టి ముందు చేసిన తప్పును అంగీకరించి, క్షమాపణ కోరాలి.

ఒకరి జీవితాన్ని నాశనం చేశామన్న విషయాన్ని ఒప్పుకోవాలి. కానీ అలాంటిదేమీ ఎప్పుడూ జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు.

నానా పటేకర్‌ మరణం తర్వాత కూడా తనకు సమస్యలు ఎదురవుతున్నాయని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన మరణించినప్పుడు 'ఈవిల్‌ డెడ్‌' అని అభివర్ణించినట్లు వివరించారు.

ఆయన మరణం తర్వాత కూడా నా జీవితంలో సమస్యలు కొనసాగుతున్నాయి. అందుకే 'ఈవిల్‌ డెడ్‌' అని అన్నాను.

ADVERTISEMENT