Page Loader
Naa Saami Ranga Ashika Ranganath : నానా సామిరంగ అప్‌డేట్.. కథానాయిక ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్.. లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌ 
లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌

Naa Saami Ranga Ashika Ranganath : నానా సామిరంగ అప్‌డేట్.. కథానాయిక ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్.. లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 04, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

నా సామిరంగ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ తొలి స్టిల్ రిలీజ్ అయ్యింది. వ‌ర‌ల‌క్ష్మి పాత్ర‌లో ఆషికా రంగ‌నాథ్ అలరించనున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్'లో లంగా వోణీ ధ‌రించి సాంప్రదాయ చీరకట్టులో ఆషికా రంగ‌నాథ్ అదరగొట్టింది. త‌న అందాన్ని అద్ధంలో చూస్తూ సిగ్గుతో మురిసిపోయిన‌ట్లుగా ఆషికా రంగ‌నాథ్ ఫ‌స్ట్ లుక్, క‌నిపిస్తోంది. ఆదివారం బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఆషికా రంగ‌నాథ్ లుక్‌ను రిలీజ్ చేశారు. క‌ళ్యాణ్ రామ్ అమిగోస్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగ‌నాథ్‌. ప్రస్తుతం తన రెండో సినిమా నా సామి రంగలో న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరలక్ష్మిని పరిచయం చేసిన చిత్ర నిర్మాణ బృందం