Kalki 2 Sequel Update: నాగ్ అశ్విన్ ప్లాన్ గ్రాండ్.. 'కల్కి 2'లో కోలీవుడ్ స్టార్ హీరో?
ఈ వార్తాకథనం ఏంటి
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈకథను మరింత విస్తృతంగా, మరింత భారీ స్థాయిలో చూపేందుకు సీక్వెల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై వినిపిస్తున్న క్రేజీ లీక్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ సీక్వెల్‌లో క్లైమాక్స్‌లో వచ్చే ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ ఉందని సమాచారం. ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శింబును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శింబు ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, తమిళ మార్కెట్‌లో ఈ సినిమాకు మరింత బలమైన ఆదరణ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్
మొదటి భాగం చివర్లో ప్రభాస్ పాత్రను కర్ణుడిగా పరిచయం చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ కొనసాగింపుగా సీక్వెల్‌కు 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మొదటి భాగంలో కల్కి ఆవిర్భావాన్ని చూపగా, రెండో భాగంలో కర్ణుడి గతం, అతని పునరాగమనం, శతాబ్దాల నాటి కథాంశాన్ని లోతుగా చూపించనున్నారని సమాచారం. ఇక హైదరాబాద్‌లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్లో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ పాత్ర), కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్ పాత్ర)ల మధ్య ఒక అద్భుతమైన యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.