LOADING...
Dhootha: నిర్మాతగా నాగచైతన్య కొత్త ప్రయాణం.. 'దూత' రెండో భాగానికి శ్రీకారం
నిర్మాతగా నాగచైతన్య కొత్త ప్రయాణం.. 'దూత' రెండో భాగానికి శ్రీకారం

Dhootha: నిర్మాతగా నాగచైతన్య కొత్త ప్రయాణం.. 'దూత' రెండో భాగానికి శ్రీకారం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 05, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో నాగ చైతన్యకు డిజిటల్‌ వేదికపై మంచి గుర్తింపు తీసుకొచ్చిన వెబ్‌సిరీస్‌ 'దూత'. తొలి సీజన్‌తోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సిరీస్‌ ఇప్పుడు రెండో భాగంతో ముందుకు రానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ప్రముఖ నటుడు నాగార్జున క్లాప్‌ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సీక్వెల్‌లో మరో విశేషం ఏమిటంటే.. నాగచైతన్య తొలిసారిగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలను పంచుకుంటూ, "'దూత' రెండో అధ్యాయంతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమవుతోంది" అని పేర్కొన్నారు.

వివరాలు

మరోసారి ఆ పాత్రతో మెప్పించనున్న నాగచైతన్య..

అలాగే, మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ రూపొందించిన 'దూత' తొలి సీజన్‌ 2023 డిసెంబర్‌ 1న 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో' వేదికగా విడుదలైంది. హారర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ విశేష ఆదరణ పొందడమే కాకుండా పలు రికార్డులను కూడా నమోదు చేసింది. ఇందులో జర్నలిస్టు సాగర్‌ వర్మ అవధూరి పాత్రలో నాగచైతన్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement