Nagarjuna King 100: నాగార్జున, టబు మళ్లీ జతకట్టారు.. 'కింగ్ 100' నుంచి క్రేజీ అప్‌డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున, సీనియర్ నటి టబు కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో ఈ జోడీ తెరపై పండించిన మ్యాజిక్‌ను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అయితే చాలా ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. కానీ ఈసారి వీరిద్దరి మధ్య ప్రేమకథ ఉండదట! ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం 'కింగ్ 100' నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను నవంబర్ 4న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వివరాలు
'ఈసారి ప్రేమ కాదు'.. అసలు కథేంటి?
ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
పాతకాలం నాటి రేడియో (బూమ్‌బాక్స్), చీరకట్టులో నడుచుకుంటూ వెళ్తున్న టబు బ్యాక్‌లుక్ విజువల్స్‌తో ఈ వీడియోను రూపొందించారు. ఈ ప్రమోషనల్ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఒకటుంది.
అదే.. 'దిస్ టైమ్.. ఇట్స్ నాట్ లవ్' (ఈసారి.. ఇది ప్రేమ కాదు) అనే క్యాప్షన్. సాధారణంగా నాగార్జున, టబు పేర్లు వినగానే ప్రేక్షకులకు ఓ అందమైన రొమాంటిక్ లవ్‌స్టోరీ గుర్తుకొస్తుంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈసారి మాత్రం దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్ భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. డిసెంబర్ 24న విడుదల!
నాగార్జున, టబు మధ్య ప్రేమకు బదులుగా బలమైన వైరం లేదా ఇప్పటివరకు చూడని సరికొత్త బంధాన్ని చూపించబోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది.
ఒకప్పుడు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ మధ్య 'ప్రేమ లేదు' అని ప్రమోషనల్ వీడియోలోనే స్పష్టం చేయడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
అక్కినేని కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.
సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.