Page Loader
Nani 31: ఇట్స్ అఫీషియల్.. నాని 31 సినిమాలో ఎస్‌జే సూర్య 
ఇట్స్ అఫీషియల్.. నాని 31 సినిమాలో ఎస్‌జే సూర్య

Nani 31: ఇట్స్ అఫీషియల్.. నాని 31 సినిమాలో ఎస్‌జే సూర్య 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని 31వ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల మార్క్ ఆంటోనిలో కనిపించిన దర్శక, నటుడు ఎస్‌జే సూర్య, నాని31 మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో సూర్య విలన్‌గా నటించబోతున్నట్లు ఆదివారం ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను కొంత నిజం చేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎస్‌జే సూర్యను మూవీలోకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. కానీ సినిమా ఏ పాత్ర పోషిస్తున్నాడనే దానిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్నారు. నాని-ఆత్రేయ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. షూటింగ్ అక్టోబర్ 24, 2023న ప్రారంభం కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్