Page Loader
Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా 
Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా

Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా 

వ్రాసిన వారు Stalin
Oct 21, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఇది నానికి 31వ సినిమా కావడంతో దీనికి 'నాని31' వర్కింట్ టైటిల్ పెట్టారు. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో ఇది రెండో సినిమా. 2022లో వీరి కలయికలో 'అంటే సుందరానికి' మూవీ విడుదలై.. ప్రేక్షకులను అలరించింది. నాని-వివేక్ కొత్త సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, నాని 30వ చిత్రం 'హాయ్ నాన్న' డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. 'నాని 31' సినిమా ముహూర్తపు కార్యక్రమం అక్టోబర్ 24న ఉంటుందని, ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాణ సంస్థ పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post