దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు దసరా బృందం. మార్చి 14వ తేదీన దసరా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ట్రైలర్ మాస్ బాంబులాగా పేలుతుందని, అందరూ రెడీగా ఉండాలని చెబుతూ ఒక పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో రావణాసురుడి బొమ్మ నిప్పుల్లో కాలుతూ ఉంటుంది. దాని ఎదురుగా నిల్చుని బొమ్మ వైపు చూస్తూ కనిపిస్తున్నాడు నాని. తెలుగుతో సహా అన్ని భాషల్లో ట్రైలర్ ను ఒకేసారి రిలీజ్ చేస్తామని తెలియజేశారు.
ఇన్ స్టా రీల్స్ లో ఛమ్కీల అంగీలేసి పాటపై వందల వీడియోలు
దసరా సినిమా విడుదలకు కొద్ది రోజులే సమయం ఉండడంతో, ప్రమోషన్లను వీరలెవల్లో చేస్తున్నారు దసరా టీం. ఇకముందు కూడా మరింత ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయని వినిపిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని, ఇండియా లెవెల్ లో దసరా పై ఆసక్తి రావాలని, అందుకోసం ఖర్చుకు వెనకాడవద్దని దసరా నిర్మాతలు, హీరో నాని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దసరా మీద వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఈ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దసరా నుండి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో రీసెంట్ గా రిలీజైన ఛమ్కీల అంగీలేసి పాట అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇన్ స్టా రీల్స్ లో ఛమ్కీల అంగీలేసి వందల వీడీయోలు వస్తున్నాయి.