Loading...
The Paradise: ఓటీటీలోకి నాని 'ది ప్యారడైజ్'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీలోకి నాని 'ది ప్యారడైజ్'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

The Paradise: ఓటీటీలోకి నాని 'ది ప్యారడైజ్'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఓ జాతి మనుగడ కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'ది ప్యారడైజ్' స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

వివరాలు

కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు

థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అయితే ఓటీటీలో ఈ సినిమాను థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తోనే అందుబాటులోకి తీసుకొస్తారా? లేదా అదనంగా మరికొన్ని సన్నివేశాలను జోడిస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించారు.

సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

ADVERTISEMENT