Page Loader
HIT3 : నాని 'హిట్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్ 
నాని 'హిట్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్

HIT3 : నాని 'హిట్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, ప్రతి సినిమా తర్వాత తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఆఖరిగా 'హ‌య్ నాన్న','స‌రిపోదా శ‌నివారం' సినిమాలతో హిట్లు సాధించిన నాని, ప్రస్తుతానికి వరుసగా సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. వీటిలో ఒకటి 'హిట్ 3'. ఇది బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్' నుండి వచ్చే మూడో చిత్రం. శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంత్ త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

వివరాలు 

మే 1న, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల 

యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నది, ముఖ్యంగా టీజర్‌ ఒక షాక్ ను ఇచ్చింది. ఇందులో నాని చాలా వైల్డ్‌గా కనిపించాడు, ఒక్కో సీన్ వణుకు పుట్టించాయి. "సార్ మీకు ప్రాబ్లమ్‌ లేదంటే ఒక పేరు చెబుతా.. అర్జున్ సర్కార్..." అన్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఈ టీజర్‌లో ఎక్కడా స్టోరీ లీక్ కాకుండా చాలా బాగా కట్ చేశారు. ఇక తాజాగా, ఈ చిత్రానికి విడుదల తేదీ ప్రకటించారు. మే 1న, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో నాని చేసిన ట్వీట్