
ప్రతినిధి 2 షూటింగ్ మొదలు: 16,32,96,000సెకన్ల తర్వాత సెట్లోకి అడుగుపెట్టిన హీరో
ఈ వార్తాకథనం ఏంటి
నారా రోహిత్..బాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సోలో సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు.
రౌడీ ఫెలో, ప్రతినిధి అసుర, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలతో తనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. నారా రోహిత్ సినిమాలంటే విభిన్నంగా ఉంటాయన్న ఆలోచన ప్రేక్షకులందరిలోనూ ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా నారా రోహిత్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. చివరగా ఆయన నటించిన వీరభోగ వసంతరాయలు చిత్రం 2018లో విడుదలైంది.
అప్పటినుండి ఇప్పటివరకు ఐదు సంవత్సరాల కాలంలో నారా రోహిత్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. నారా రోహిత్ సినిమాలు మానేశాడేమో అని చాలామంది అనుకున్నారు.
Details
ప్రతినిధి 2 షూటింగ్ మొదలు
ప్రస్తుతం నారా రోహిత్ నుండి ప్రతినిధి 2 సినిమా వస్తోంది. 2014లో తాను నటించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి 2 వస్తోంది. ఈ సీక్వెల్ కు మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ప్రతినిధి 2 చిత్ర షూటింగ్ మొదలైందని నారా రోహిత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేశారు.
16 కోట్ల 32 లక్షల 96,000వేల సెకండ్ల తర్వాత తాను మళ్లీ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టినట్లు నారా రోహిత్ చెప్పుకొచ్చారు.
వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమాకు మహతి స్వర సాగర సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జనవరి 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా రోహిత్ చేసిన ట్వీట్
16,32,96,000 seconds
— Rohith Nara (@IamRohithNara) August 28, 2023
BACK ON TRACK #Pratinidhi2 pic.twitter.com/77EZ47Kmmv