NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ
    తదుపరి వార్తా కథనం
    నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ
    నారాయణ అండ్ కో టీజర్ విడుదల

    నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 29, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా వస్తున్న చిత్రం నారాయణ అండ్ కో టీజర్ రిలీజైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేసిన ఈ టీజర్ ద్వారా ఇదొక నవ్వించే సినిమా అని అర్థమైంది.

    నారాయణ అండ్ కో ఫ్యామిలీకి తిక్క ఉంటుందని మొదట్లోనే చెప్పేసారు. మధ్యతరగతికి చెందిన నారాయణ, తిక్కల మనిషి. తన భార్యకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ.

    దేవుడికి నైవేద్యం కూడా మిల్లెట్స్ పెట్టి దేవుడు కూడా డైట్ పాటించాలని అంటుంది. ఇక పెద్ద కొడుకు పాత్రలోని సుధాకర్ కొమాకులకు బెట్టింగ్ పిచ్చి. మూడవ కొడుక్కి ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఆశ.

    ఈ తిక్కల్ ఫ్యామిలీని ఒక లోకల్ డాన్ తన లాభం కోసం వాడుకోవాలని చూస్తాడు.

    నారాయణ అండ్ కో టీజర్

    ప్రొడ్యూసర్ గా మారిన సుధాకర్ కొమాకుల

    తిక్కల్ ఫ్యామిలీతో లోకల్ డాన్ కు సమస్య వస్తుందా? లేదా లోకల్ డాన్ వల్ల తిక్కల్ ఫ్యామిలీ సమస్యల్లో పడుతుందా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

    టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. నవ్వించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సుధాకర్ కొమాకుల కొత్తగా కనిపిస్తున్నాడు. తండ్రి పాత్రలో చేస్తున్న దేవి ప్రసాద్, తల్లి పాత్రలో చేస్తున్న ఆమని, తమ తమ పాత్రల్లో ఇమిడిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

    చిన్నపాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాపిశెట్టి ఫిలిమ్ ప్రొడక్షన్, సుఖ మీడియా బ్యానర్లలో పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కొమాకుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    అరతి పోడి, పూజా కిరణ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి, డాక్టర్ జ్యోస్యభట్ల, నాగవంశీ కలిసి సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నారాయణ అండ్ కో టీజర్ విడుదల

    𝙾𝚗𝚎 𝙵𝚊𝚖𝚒𝚕𝚢 - 𝚃𝚘𝚘 𝙼𝚞𝚌𝚑 𝙵𝚞𝚗 👨‍👩‍👧‍👦
    Lets welcome the Hilarious తిక్కల్ Family 😇#NarayanaAndCo TEASER OUT NOW 💥
    - https://t.co/YfyYgKjkrN

    Coming to your nearest Theaters Soon 🤩@UrsSudhakarK @ChinnaPapisetty @Pooja_kiran @PapisettyFP @Sukha_Media @saregamasouth

    — Sudhakar Komakula (@UrsSudhakarK) March 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజర్
    తెలుగు సినిమా

    తాజా

    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్ రామ్ చరణ్
    చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్ చిరంజీవి
    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? ఓటిటి
    పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025