రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే
ప్రపంచ గణిత మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకునే శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును (డిసెంబర్ 22) జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, గణిత శాస్త్రంలో రామానుజన్ చేసిన సేవలను గౌరవిస్తూ ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలో 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. చిన్న వయసులోనే గణితంపై ఇష్టం పెంచుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ కుంభకోణం స్కాలర్ షిప్ కి అర్హత సాధించాడు. 1913లో మద్రాస్ పోర్ట్ లో గుమస్తాగా ఉద్యోగం చేస్తున్న రామానుజన్ లోని తెలివిని ఒక వ్యక్తి గుర్తించాడు. ఆ వ్యక్తి సాయంతో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ జీహెచ్ హార్డీని కలుసుకున్నాడు రామానుజన్.
రామానుజన్ నంబర్
జీహెచ్ హార్డీతో కలిసి రామానుజన్ చాలా రోజులు పనిచేసారు. 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎన్నికయ్యాడు. ఐతే ఒకసారి రామానుజన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో జీహెచ్ హార్డీ రామానుజన్ ని చూడడానికి ట్యాక్సీలో వచ్చారు. ఆ ట్యాక్సీ నంబర్ చూసిన హార్డీ మనసులో ఏదో కీడు శంకించింది. అదే విషయం రామానుజన్ కి చెప్పి, ఆ ట్యాక్సీ నంబర్ 1729 అని చెప్పాడు హార్డీ. అప్పుడు రామానుజన్, ఆ నంబర్ చాలా లక్కీ అని, ఒక సంఖ్యను రెండు ఘనాల మొత్తంగా రెండు విధాలుగా రాయగల సంఖ్యల్లో అతిచిన్న సంఖ్య అని చెప్పాడు. అప్పటి నుండి ఈ సంఖ్యను రామానుజన్ సంఖ్య అని పిలుస్తున్నారు. 1*3+ 12*3=1729 9*3+10*3= 1729.