forex: బంగారు నిల్వల పెరుగుదలతో గరిష్ఠానికి చేరువలో విదేశీ మారకపు నిల్వలు
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు మరోసారి వృద్ధిని నమోదుచేశాయి. అక్టోబర్ 17తో ముగిసిన వారంలో 4.5 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఈ నిల్వలు 702.280 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణంగా బంగారు నిల్వల పెరుగుదలను ఆర్ బీ ఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గుర్తించింది. గతేడాది 2024 సెప్టెంబర్ చివర్లో రికార్డ్ స్థాయిలో 704.885 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు నమోదు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వలు దానికి చాలా దగ్గరగా ఉన్నాయి.
Details
బంగారు ధరలు పెరిగే అవకాశం
RBI విడుదల చేసిన వివరాల ప్రకారం, సమీక్షించిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.692 బిలియన్ డాలర్లతో తగ్గి 570.411 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, పసిడి (బంగారం) నిల్వలు 6.181 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 182.546 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు పెరగడం, బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావించడం కారణంగా, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని RBI స్పష్టం చేసింది.