
బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు టెలివిజన్ లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో మార్పులు రానున్నాయి. గత నాలుగు సీజన్ ల నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున, బిగ్ బాస్ నుండి తప్పుకుంటున్నాడని అంటున్నారు.
దాంతో ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు, కొత్త హోస్ట్ కోసం వెతకడం మొదలెట్టారు.
తెలుగు సినిమా స్టార్లలో ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. భళ్లాల దేవగా గుర్తుండిపోయిన రానా ను హోస్ట్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని వినిపిస్తోంది.
రానా కి టాక్ షోస్ చేసిన అనుభవం ఉంది. అదీగాక మంచి పొడుగరి కాబట్టి స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుందని విశ్లేషిస్తున్నారు.
బిగ్ బాస్
బాలయ్యను దించాలని ఆలోచిస్తున్న బిగ్ బాస్ బృందం
కొందరు నిర్వాహకులు రానా వైపు చూస్తుంటే, మరికొందరేమో బాలయ్య వైపు చూస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతలా సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.
అందుకే బాలయ్యను హోస్ట్ గా తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారట. బాలయ్యను హోస్ట్ గా తీసుకుంటే, బిగ్ బాస్ షో కి మైలేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారట.
ఇప్పటివరకైతే ఇంకా ఏ హీరో వద్దకు వెళ్ళలేదని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ 7వ సీజన్ కి కొత్త హోస్ట్ గా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.
నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 6 సీజన్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు. ఫస్ట్ రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. కీర్తికి మూడవ స్థానం దక్కింది.