LOADING...
Rohini Kalam: ఉరేసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణి ఆత్మహత్య
ఉరేసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణి ఆత్మహత్య

Rohini Kalam: ఉరేసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణి ఆత్మహత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాధాగంజ్‌లోని అర్జున్ నగర్ నివాసి, అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రోహిణి అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పని చేస్తోంది. నిన్నే ఆమె దేవాస్ నుంచి తిరిగి ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నారు. అల్పాహారం తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ తరువాత ఆమె గదిలోకి వెళ్లి లోపలి తలుపు లాక్ చేసుకుంది.

Details

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

చాలా సేపు బయటకు రాకపోవడంతో, ఆమె చెల్లెలు ఒక ఇనుప రాడ్‌తో తలుపును పగలగొట్టి గదిలోకి చూడగా, రోహిణి ఉరి వేసుకుని మృతదేహంగా కనిపించింది. గత సంవత్సరం, అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ జుజిట్సు పోటీలో రోహిణి కలాం కాంస్య పతకాన్ని గెలుచుకున్నది. ఇటీవల ఆమె కడుపులో కణితికి శస్త్రచికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆత్మహత్యకు గల కారణం స్పష్టంగా తెలియలేదు, ఎటువంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. సమాచారం అందుకున్న బిఎన్‌పి పోలీసులు ఘటనా స్థలానికి చేరి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు