LOADING...
NBK111: మహారాణిగా నయనతార.. బాలకృష్ణతో నాలుగోసారి స్క్రీన్ షేర్
మహారాణిగా నయనతార.. బాలకృష్ణతో నాలుగోసారి స్క్రీన్ షేర్

NBK111: మహారాణిగా నయనతార.. బాలకృష్ణతో నాలుగోసారి స్క్రీన్ షేర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస సినిమాలతో దూసుకుపోతున్న లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అగ్ర నటుడు బాలకృష్ణ హీరోగా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న '#NBK111' చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడిస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. 'సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో దాచుకున్న రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెడుతోందనే శీర్షికతో ఆ వీడియోను రిలీజ్ చేస్తూ, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Details

త్వరలో మరిన్ని అప్‌డేట్స్

త్వరలోనే ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్స్ అందుబాటులోకి రానున్నాయని టీమ్ తెలిపింది. కాగా, నవంబర్‌ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. బాలకృష్ణ - నయనతార కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ జోడీ నటించిన 'సింహా', 'జైసింహా', 'శ్రీరామరాజ్యం' సినిమాలు విజయాలు సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు వీరి నాలుగో కాంబినేషన్‌గా '#NBK111' రూపుదిద్దుకోవడం విశేషం. అలాగే, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ

చరిత్ర-వర్తమానం మేళవింపుతో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గంభీరమైన సెట్టింగ్స్‌, శక్తివంతమైన పాత్రలు, భారీ స్కేల్‌ను వాగ్దానం చేస్తూ '#NBK111' ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.