Nayanthara: యష్ 'టాక్సిక్' నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
'KGF' సిరీస్‌తో మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి కియారా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం,తాజాగా నయనతార ఫస్ట్ లుక్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నయనతార 'గంగా' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆమె లుక్ తీవ్రంగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. యష్ సరసన నయనతార నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది.
vivaralu
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల
'KGF 2' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి ప్రధాన భారతీయ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యష్ చేసిన ట్వీట్
Introducing Nayanthara as GANGA in - A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie
— Yash (@TheNameIsYash) December 31, 2025
@advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC