బాలకృష్ణ 108: అనిల్ రావిపూడికి అప్పుడే వద్దని చెప్పిన బాలకృష్ణ
వీరసింహారెడ్డి విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలెట్టాడు బాలకృష్ణ. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. తన గత సినిమాల్లాగే ఇందులోనూ కామేడీ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని, దాంతోపాటు యాక్షన్ సీన్లు అదిరిపోతాయని, వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. దాంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి అంచనాలను పెట్టేసుకున్నారు. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, మరికొన్ని రోజులు వాయిదా పడేలా ఉందని తెలుస్తోంది. నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో కొన్ని రోజులు షూటింగ్ ని వాయిదా వేయనున్నారట.
వచ్చే నెలలో షూటింగ్ మొదలు
ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుందని, మార్చ్ లో మళ్ళీ షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. తారకరత్న అస్వస్థతకు గురైనప్పటి నుండి అన్నీ దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణ, ఇప్పుడు తారకరత్న మరణంతో తీవ్ర దుఃఖంలోమునిగిపోయారు. ఆల్ మోస్ట్ ప్రాణానికి ప్రమాదమేమీ లేదని తెలిసిన తర్వాత ఇలా జరగడం అందరినీ బాధకు గురి చేస్తోంది. తారకరత్న మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలియజేసారు. తారకరత్న పార్థివ దేహాన్ని తెలుగు ఫిలిమ్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.