LOADING...
NBK - Koratala Siva : ఆ మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య..పూనకాలు లోడింగ్!
ఆ మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య..పూనకాలు లోడింగ్!

NBK - Koratala Siva : ఆ మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య..పూనకాలు లోడింగ్!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలయ్య కొత్త సినిమా కథపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, విజయవంతమైన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్లు ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతున్నాయి.

వివరాలు

సెకండాఫ్ హైలెట్

ముఖ్యంగా ఈ చిత్రంలో సెకండాఫ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య కోసం కొరటాల శివ పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్‌ను సిద్ధం చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందులో బాలకృష్ణ ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారని చెబుతున్నారు. భారీ మాస్ సన్నివేశాలతో పాటు, ఆ పాత్ర చుట్టూ తిరిగే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ గతంలో కనిపించని విధంగా కొత్త మేకోవర్‌లో దర్శనమివ్వనున్నారని సమాచారం. కొరటాల శివ శైలిలో సామాజిక సందేశంతో పాటు, బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే హై వోల్టేజ్ మాస్ అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

వివరాలు

కథ విషయంలో ప్రత్యేక శ్రద్ధ..

'దేవర' వంటి భారీ విజయానంతరం కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, కథ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందులో యాక్షన్‌కు మాత్రమే కాకుండా, కుటుంబ భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. విభిన్నమైన కథతో, పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. మే 1న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

వివరాలు

త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్..

ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే, కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Advertisement