NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వేసవి నుండి షిఫ్ట్ అయ్యి సరికొత్త రిలీజ్ డేట్ లో వస్తున్న హరిహర వీరమల్లు?
    తదుపరి వార్తా కథనం
    వేసవి నుండి షిఫ్ట్ అయ్యి సరికొత్త రిలీజ్ డేట్ లో వస్తున్న హరిహర వీరమల్లు?
    దసరా కానుకగా హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం

    వేసవి నుండి షిఫ్ట్ అయ్యి సరికొత్త రిలీజ్ డేట్ లో వస్తున్న హరిహర వీరమల్లు?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 02, 2023
    09:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు రాజకీయంలో దూకుడుగా ఉంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నారు.

    క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలోని ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ చిత్రాలు లైనప్ లో ఉన్నాయి.

    ఇవే కాకుండా ఓజీ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంటుందని వినిపించింది. సినిమాల లిస్ట్, పెద్దగానే ఉంది కానీ వాటి రిలీజ్ లు మాత్రం చాలా దూరంలో ఉన్నాయి.

    ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ఇంకా మొదలవలేదు కాబట్టి వీటిని తెరమీద చూడాలంటే వచ్చే సంవత్సరం వరకూ ఆగాల్సిందేనని చెప్పుకుంటున్నారు. ఇక వేసవిలో వస్తుందనుకున్న హరిహర వీరమల్లు చిత్రం వాయిదా పడిందని తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్

    దసరా కానుకగా రానున్న హరిహర వీరమల్లు

    పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఇంకా మిగిలే ఉండడం వల్ల ఆలస్యమవుతుందని అంటున్నారు.

    ఇదే నిజమైతే వేసవిలో సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్న అభిమానులకు నిరాశ తప్పదు. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో, బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

    ఔరంగజేబు కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో, కోహీనూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ పాత్ర దొంగిలిస్తుందని సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావ్ నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్

    తాజా

    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్

    తెలుగు సినిమా

    హృతిక్ రోషన్ పై కామెంట్లకు 14ఏళ్ళ తర్వాత రాజమౌళి వివరణ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    అమెరికాలో వీరసింహారెడ్డిని దాటేసిన వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్య
    ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు వాల్తేరు వీరయ్య

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025