సోషల్ మీడియా సాక్షిగా నీహారిక కొణిదెల క్లారిటీ ఇచ్చేసినట్టేనా?
మెగా డాటర్ నీహారిక కొణిదెల, తన భర్త చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధాన్ని దూరం చేసుకుంటుందనే వార్తలు ఎన్నో రోజులుగా వస్తున్నాయి. వీరిద్దరూ పరస్పరం తమ బంధానికి స్వస్తి పలకాలని అనుకుంటున్నారని అనేక పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చుతూ నీహారిక కొణిదెలను ఇన్స్ టాలో అన్ ఫాలో చేసాడు చైతన్య జొన్నలగడ్డ. అలాగే తమ పెళ్ళి ఫోటోలను సోషల్ మీడియా నుండి డిలీట్ చేసాడు. దాంతో ఒక్కసారిగా నీహారిక, చైతన్యల మధ్య బంధంలో ఏవో పొరపొచ్చాలు ఏర్పడ్డాయని అందరికీ క్లారిటీగా చెప్పేసినట్టయ్యింది. కాకపోతే పొరపొచ్చాలను సద్దుమణిగించడానికి పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని వినబడింది. ఈ ప్రయత్నాలేవీ ఫలించలేనట్లుగా నీహారిక చేసిన పనుల వల్ల అర్థమైపోతుందని కామెంట్లు వస్తున్నాయి.
చైతన్య జొన్నలగడ్డను అన్ ఫాలో చేసిన నీహారిక
తాజాగా నీహారిక కొణిదెల, తన ఇన్స్ టా అకౌంట్ లో నుండి తన పెళ్ళి ఫోటోలను డిలీట్ చేసింది. అంతేకాదు తన భర్త చైతన్య జొన్నలగడ్డను అన్ ఫాలో చేసేసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధంపై ఒక క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పుకుంటున్నారు. అప్పుడు చైతన్య అన్ ఫాలో చేయడం, ఇప్పుడు నీహారిక అన్ ఫాలో చేయడం చూస్తుంటే, మరికొద్ది రోజుల్లో బాంబ్ పేల్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2020 డిసెంబర్ 9వ తేదీణ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది నీహారిక. పెళ్ళికి ముందు సినిమాలు, టీవీ షోస్ లో కనిపించిన నీహారిక, ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టే పనిలో నీహారిక ఉందని సమాచారం.