
నీహారిక కొణిదెల బ్రేకప్ రూమర్స్, ఆజ్యం అవుతున్న అన్ ఫాలో
ఈ వార్తాకథనం ఏంటి
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక కొణిదెల వివాహం, చైతన్య జొన్నలగడ్డ తో అట్టహాసంగా జరిగింది. 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి బంధంపై అనేక పుకార్లు వచ్చాయి. నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.. విడిపోయే అవకాశం ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఇప్పుడా పుకార్లకు ఆజ్యం పోసేలా కొన్ని సంఘటనలు కనిపించాయి. నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.. ఇద్దరూ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకున్నారు.
అంతేకాదు, తమ పెళ్ళి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లోంచి డిలీట్ చేసాడు చైతన్య జొన్నలగడ్డ.
నీహారిక కొణిదెల
ఫోటోలు డిలీట్ చేయని నీహారిక కొణిదెల
అన్ ఫాలో చేయడమే కాకుండా పెళ్ళి ఫోటోలు డిలీట్ చేయడంతో మెగా అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇటు సోషల్ మీడీయాలో ఈ విషయమై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నీహారిక మాత్రం పెళ్ళి ఫోటోలను డిలీట్ చేయలేదు. చైతన్య జొన్నలగడ్డను మాత్రం అన్ ఫాలో చేసింది.
దీంతో వారి మధ్య సఖ్యత కుదరడం లేదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
పెళ్ళికి ముందు పలు టీవీ షోస్ లో యాంకర్ గా కనిపించింది నీహారిక. అంతేకాదు, ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. ఐతే హీరోయిన్ గా ఆమెకు సక్సెస్ రాలేదు.