Page Loader
Swayambhu: స్వయంభూలో హనుమంతుని భక్తునిగా నిఖిల్ 
Swayambhu: స్వయంభూలో హనుమంతుని భక్తునిగా నిఖిల్

Swayambhu: స్వయంభూలో హనుమంతుని భక్తునిగా నిఖిల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

నిఖిల్ గత చిత్రం స్పై ఘోర పరాజయం పాలైంది.నిఖిల్ ఇప్పుడు స్వయంభూ అనే పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకుడు.ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారాన్ని నిఖిల్ మీడియాతో పంచుకున్నాడు. ఈ సినిమాలో తాను హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నానని తెలిపిన నిఖిల్, సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ "జై శ్రీరాం" అని చెప్పాడు. ప్రస్తుతం కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నటుడు పేర్కొన్నాడు.

Details 

నిఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం

దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్, పిక్సెల్ స్టూడియోస్ క్రింద స్వయంభూని సమర్పిస్తున్నారు. స్వయంభూ నిఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హనుమంతుని భక్తునిగా నిఖిల్