Allu Arjun: మాటలే కాదు.. చేతల్లోనూ నిరూపించిన అల్లు అర్జున్.. అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన అభిమానులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులకు ఊహించని బహుమతిగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రమాద బీమా (యాక్సిడెంట్ ఇన్సూరెన్స్) చేయించి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆయన 'రాకా' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
వివరాలు
ఫ్యాన్స్ మీట్‌లో కీలక ప్రకటన
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ అభిమానులతో సరదాగా ముచ్చటించి, వారితో కలిసి ఫొటోలు దిగారు.
ఈ సందర్భంగా అభిమానుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఫ్యాన్స్ అసోసియేషన్‌లోని రాష్ట్ర స్థాయి సభ్యులకు రూ.5 లక్షలు, జిల్లా స్థాయి సభ్యులకు రూ.3 లక్షల చొప్పున ప్రమాద బీమా కల్పించినట్లు వెల్లడించారు.
వివరాలు
సభ్యులకు ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డులను సభ్యులకు అల్లు అర్జున్ స్వయంగా అందజేశారు. ఈ కార్డుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వెయ్యి మంది అభిమానులతో సందడి
ఈ ఫ్యాన్స్ మీట్‌కు సుమారు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమంలో అల్లు అర్జున్ ట్రోల్స్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
వివరాలు
అభిమానుల కోసం ప్రత్యేక శ్రద్ధ
గత కొంతకాలంగా అల్లు అర్జున్ తన అభిమాన సంఘాలను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తూ వస్తున్నారు.
అభిమానులతో మరింత బలమైన అనుబంధాన్ని కొనసాగించే దిశగా ఆయన తీసుకుంటున్న చర్యలు తన ఇమేజ్‌ను మరింత పటిష్ఠం చేస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అభిమానుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాద బీమా కల్పించడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తున్నారు.