NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ కు సమానంగా ఎన్టీఆర్ 30: వెల్లడించిన ఎన్టీఆర్
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్ కు సమానంగా ఎన్టీఆర్ 30: వెల్లడించిన ఎన్టీఆర్
    ఎన్టీఆర్ 30పై ఎన్టీఆర్ మాటలు

    ఆర్ఆర్ఆర్ కు సమానంగా ఎన్టీఆర్ 30: వెల్లడించిన ఎన్టీఆర్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 14, 2023
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో యావత్ భారతదేశం ఆనందంగా ఉంది. భారత జెండాను ఆస్కార్ వేదిక మీద నాటు నాటు అంటూ ఎగరవేసిన ఆర్ఆర్ఆర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

    ఆ ప్రశంసల వర్షంలో ఆర్ఆర్ఆర్ టీమ్ తడిసి ముద్దవుతుండగా, ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్, తన అభిమానులకు మరో ఆసక్తికర విషయాన్ని అందించాడు.

    ఆస్కార్ అవార్డుల అనంతరం, అమెరికన్ మీడియాతో ముచ్చటించిన ఎన్టీఆర్, ఆస్కార్ రావడం ఆనందంగా ఉందని చెబుతూ, తన తర్వాతి సినిమా కూడా ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఉంటుందనీ, ఈ నెలలో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని, ఆ విషయం ఎక్సైటింగ్ గా ఉందని అన్నాడు.

    దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

    ఎన్టీఆర్ 30

    ఎన్టీఆర్ 30 మొదలు విషయంలో నిరాశలో ఉన్న అభిమానులు

    అటు ఆస్కార్ ఆనందంతో పాటు ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలవుతుందన్న మాటలు ఎన్టీఆర్ నోటి నుండి రావడం అభిమానులకు ఆనందాన్ని అందిస్తోంది.

    ఆర్ఆర్ఆర్ వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఎన్టీఆర్, తన తర్వాతి చిత్రాన్ని ఇంకా మొదలెట్టలేదనే చిన్నపాటి నిరాశ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది.

    ఆస్కార్ తో ఆర్ఆర్ఆర్ పనులన్నీ పూర్తవడంతో, ఇక పూర్తి దృష్టి తన తర్వాతి సినిమానే పెట్టేలా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్.

    ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    తెలుగు సినిమా

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత సినిమా
    రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్ సినిమా
    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు టీజర్
    సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025