
చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'; 'నాటు నాటు' పాటను వరించిన ఆస్కార్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాట చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును గెల్చుకొని.. తెలుగు సినిమా సత్తాను చాటింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అవార్డును గెల్చుకొని భారతీయ సినీ ప్రేమికులను మరింత గర్వపడేలా చేసింది.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి భారతీయుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కోరుకున్నట్లు భావోద్వేగ ప్రసంగం చేశారు.
నాటు నాటును తెలుగులో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు.
ఆస్కార్
అవార్డును ప్రకటించిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె
ఆస్కార్ వేదిపై నాటు నాటు పాటకు అవార్డును బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రకటించింది. నల్లటి మెర్మైడ్ కట్ డ్రెస్‌లో దీపిక మెరిసింది.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒప్లివియా, రే స్టీవెన్సన్, అజయ్ దేవగన్ మరియు శ్రియా శరణ్ వంటి తారాగణం ఉన్నారు.
ఆస్కార్-2023 కార్యక్రమంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు.