NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్
    ఓటింగ్ లో పాల్గొన్న తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్

    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 09, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఇంకో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    ఆ ఎదురు చూపుల్లో ఇండియాకు మొదటి స్థానం దక్కుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సారి ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో ఇండియా నుండి మూడు నామినేషన్లు ఉన్నాయి.

    ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు పాట, ఆల్ దట్ బ్రీత్స్ అనే డాక్యుమెంటరీ ఫీఛర్, ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్.. నామినేషన్లలో ఉన్నాయి.

    ఇవే కాదు ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకునేకు ఆహ్వానం దక్కింది. అలాగే ఆస్కార్ అవార్డుల ఓటింగ్ కమిటీలో తమిళ నటుడు సూర్యకు స్థానం దక్కింది.

    ఆస్కార్ అవార్డు

    ఆస్కార్ ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య

    ఆస్కార్ అవార్డుకు నామినేట్ చిత్రాలకు ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారికి మాత్రమే అవార్డు ఉంటుంది. ప్రస్తుతం హీరో సూర్య, తన ఆస్కార్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

    ఈ మేరకు ఓటు వేసానంటూ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు సూర్య. తమిళం నుండి ఆస్కార్ నామినేషన్లకు ఓటు వేసిన మొదటి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. ఐతే తన ఓటు దేనికి వేసాడనేది మాత్రం సూర్య వెల్లడి చేయలేదు.

    బాలీవుడ్ నటి కాజోల్ కి కూడా ఆస్కార్ నామినేషన్లలో ఉన్న సినిమాలకు ఓటు వేయడానికి ఆహ్వానం అందింది.

    ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదిన ఉదయం 5గంటలకు ప్రారంభం కానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆస్కార్ అవార్డ్స్ ఓటింగ్ లో పాల్గొన్న హీరో సూర్య

    Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p

    — Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్కార్ అవార్డ్స్

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి నాటు నాటు పాట
    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025