
ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట లైవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టిస్తున్న ప్రభంజనాలు ఇన్నీ అన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని అందిపుచ్చుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది.
మొన్నటికి మొన్న హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఆస్కార్ కోసం సిద్ధం అవుతోంది.
ఐతే ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఒక ఎత్తయితే, ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు వస్తున్న ప్రశంసలు మరొక ఎత్తు. మొత్తం ప్రపంచమే ఈ పాటకు ఊగిపోతోంది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ నామినేషన్లలో నాటు నాటు పాట నిలవడం అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటను పాడబోతున్నారు.
నాటు నాటు పాట
రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు దొరికిన అవకాశం
గత కొన్ని రోజులుగా ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట లైవ్ ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ నిజమవబోతున్నాయి. ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో నాటు నాటు పాట లైవ్ ఉంటుందని అకాడమీ అవార్డ్స్ స్పష్టం చేసింది.
ఒరిజినల్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు, ఆస్కార్ వేదిక నాటు నాటు అంటూ తమ గొంతు విప్పబోతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అకాడమీ అవార్డ్స్ ప్రకటించింది.
దీంతో తెలుగు సినిమా అభిమానులు, భారతీయ సినిమా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదంతా భారతీయ సినిమాకు దక్కిన గౌరవమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
భారతీయ కాలమానం ప్రకారం మార్చ్ 13వ తేదీన ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆస్కార్స్ వేదికపై అదిరే పర్ఫార్మెన్స్.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన
Rahul Sipligunj Kaala Bhairava live performance for #NaatuNaatu at the 95th Oscars on 12th March. #RRRMovie pic.twitter.com/Wry2tUn1Ra
— Aakashavaani (@TheAakashavaani) February 28, 2023