ఆర్ఆర్ఆర్: ఆఖరుసారిగా 200 థియేటర్లలో రీ రిలీజ్ కు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ మూవీని అమెరికా జనాలు నెత్తిన పెట్టేసుకున్నారు. ఆల్రెడీ ఎన్ కోర్ ల రూపంలో ఎన్నోసార్లు థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్ ను తీసుకొచ్చారు. ఎన్ కోర్ ల ద్వారానే అమెరికా జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యింది ఆర్ఆర్ఆర్.
తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మార్చ్ 3వ తేదీన నార్త్ అమెరికాలోని 200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ని విడుదల చేస్తున్నట్లు వేరియన్స్ ఫిలిమ్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్రైలర్ ను కట్ చేసింది.
ఈ 200థియేటర్లలో తెలుగు వెర్షన్ లోని ఆర్ఆర్ఆర్ మూవీని ప్రదర్శించనున్నారట. 3వ తేదీకంటే ముందుగా మార్చ్ 1వ తేదీనాడు స్పెషల్ షో ఉండనుందని తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లోని ఏస్ హోటల్ లో ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శిస్తారట.
ఆర్ఆర్ఆర్
తెలుగు రాష్ట్రాల్లోనూ మరోమారు రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్
ఏస్ హోటల్ లో ఆర్ఆర్ఆర్ ప్రదర్శనను చూడడానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, రామ్ చరణ్ హాజరు కానున్నారట.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మరోమారు థియేటర్లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఈ విషయమై నిర్ణయం తీసుకునే పనిలో ఉందట.
అన్నీ కుదిరితే ఆస్కార్ కంటే ముందుగా ఇండియన్ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ని ఇంకోసారి చూడవచ్చు.
ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ పాట విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాట, ఆస్కార్ గెలుస్తుందో లేదో తెలియాలంటే మార్చ్ 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో 200 థియేటర్లలో రీ రిలీజ్
#RRR FINAL TRAILER
— Variance Films (@VarianceFilms) February 22, 2023
Let the CelebRRRation begin! S.S. Rajamouli's masterpiece #RRRMovie is roaring back to over 200 theaters nationwide starting March 3rd. Tickets and theater list here: https://t.co/VUSJeHFLGW #RRRforOscars @sarigamacinemas pic.twitter.com/5xtqbQFKjJ