NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ హీరోల హవా: బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ సరసన చోటు
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్ హీరోల హవా: బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ సరసన చోటు
    క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ హీరోలు

    ఆర్ఆర్ఆర్ హీరోల హవా: బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ సరసన చోటు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ హవా ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనంగా ప్రతీరోజూ వస్తున్న ప్రశంసలు ఒక కారణమైతే, అవార్డ్ నామినేషన్లలో దూసుకుపోవడం రెండవ కారణం.

    తాజాగా ఆర్ఆర్ఆర్ యాక్టర్లు, క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యారు. బెస్ట్ యాక్టర్ విభాగంలో రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరూ నామినేట్ కావడం విశేషం.

    ఈ నామినేషన్లలో మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలతో పాటు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు.

    ఈ అవార్డు, ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ హీరోలకే వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. హాలీవుడ్ స్టార్ల సరసన తమ హీరోలను చూసి మురిసిపోతున్నారు.

    ఆర్ఆర్ఆర్

    మార్చ్ 3వ తేదీన అమెరికాలో ఆర్ఆర్ఆర్ మరోసారి విడుదల

    ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు భారతీయులను గర్వపడేలా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ అవార్డుల ఖాతాలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు చేరేలా కనిపిస్తున్నాయి.

    ఇందులో నాలుగు నామినేషన్లు పొందింది ఆర్ఆర్ఆర్. ఫిబ్రవరి 24వ తేదీన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ప్రత్యేక అతిధిగా హాజరవుతున్నాడు. అలాగే అవార్డు అందజేసే గౌరవాన్ని పొందుతున్నాడు.

    అదలా ఉంటే, ఆస్కార్ అవార్డుల కంటే ముందే మరోసారి ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి రానుంది. మార్చ్ 3వ తేదీన థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్ వస్తుందని వేరియంట్ ఫిలిమ్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్రైలర్ కూడా రిలీజైంది.

    ఈ రీ రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025