
ఆస్కార్ అవార్డ్స్: ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన ఉదయం నుండి మొదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అమెరికాకు చేరుకుంది.
రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, కాలభైరవలు కొన్నిరోజుల నుండే అమెరికాలో ఆర్ఆర్ఆర్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా జాయిన్ అయ్యారు.
ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఆస్కార్ సంబరాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు రాహుల్.
ఐతే ఆస్కార్ వేడుకలకు వచ్చిన వారికి హాలీవుడ్ సెలెబ్రిటీలు పార్టీలు ఇస్తుంటారు.
నాటు నాటు పాట
ఆస్కార్ వేదిక మీట నాటు నాటు పాడబోతున్న రాహుల్ సిప్లిగంజ్
ప్రియాంకా చోప్రా ఇచ్చిన పార్టీకి హాజరైన రాహుల్, ఆమెతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మొత్తానికి ఆస్కార్ ఆనందాన్ని రాహుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
అదలా ఉంచితే, ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటను లైవ్ లో పాడబోతున్నాడు రాహుల్. కాలభైరవ తో కలిసి నాటు నాటు అంటూ హాలీవుడ్ జనాలను ఉర్రూతలూగించనున్నాడు.
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో పాటు మరో నాలుగు పాటలు ఆస్కార్ నామినేషన్లలో ఉన్నాయి. అందులో లేడీగాగా హోల్డ్ మై హ్యాండ్, రిహాన్నా లిఫ్ట్ మీ అప్ కూడా ఉన్నాయి.
మరి అందరూ ఊహిస్తున్నట్టు ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ అందుతుందో లేదో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్
It was pleasure being a part of your party @priyankachopra ji ❤️❤️ pic.twitter.com/ffgUbzuatA
— Rahul Sipligunj (@Rahulsipligunj) March 10, 2023