విదేశాలకు విహారానికి వెళ్తున్న ఎన్టీఆర్: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న దేవర
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్న ఎన్టీఆర్, ఎయిర్ పోర్టులో కనిపించడంతో అభిమానులు ఫోటోలు తీసారు. ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వారం రోజులపాటు విదేశాలకు వెళ్తున్నారట. ఎయిర్ పోర్టులో కుటుంబంతో కనిపించిన తారక్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వారం రోజుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చి దేవర షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. దేవర షూటింగు మొదలు పెట్టక ముందు కూడా నెల రోజులపాటు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ కి వెళ్ళారు ఎన్టీఆర్.