JrNTR : వెంకీ 'ఆదర్శ కుటుంబం'లో ఎన్టీఆర్.. యంగ్ టైగర్‌తో అదిరిపోయే ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
వివరాలు
వెంకీ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్?
'ఆదర్శ కుటుంబం'లో ప్రధాన పాత్రల పరిచయంతో పాటు, వెంకటేష్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యాన్ని వివరించేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ వాయిస్ ద్వారా కథలోని ప్రధాన కాన్ఫ్లిక్ట్‌ను రివీల్ చేస్తే ప్రేక్షకులు కథకు మరింతగా కనెక్ట్ అవుతారని త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
'లెనిన్' సెంటిమెంట్..
ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమాలో పాత్రల పరిచయం, కథనానికి సంబంధించిన సంభాషణలకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఆ సినిమా హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌ను 'ఆదర్శ కుటుంబం'కు కూడా అప్లై చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 'ఆదర్శ కుటుంబం'లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే వార్త నిజమైతే మాత్రం సినిమాపై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారీ అంచనాలతో 'ఆదర్శ కుటుంబం'
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.