ఎన్టీఆర్ 30: హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్, అదిరిపోయిన ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ 30 నుండి అప్డేట్ వచ్చేసింది. ఎప్పటి నుండో అందరూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందని అధికారిక ప్రకటన ఈ రోజే వెలువడింది. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా, ఎన్టీఆర్ 30 బృందం అప్డేట్ ఇచ్చింది. తుఫాను లోని ప్రశాంతతనిచ్చే పాత్రగా జాన్వీ కపూర్ పాత్రను పరిచయం చేసారు. సముద్రపు అలలు ఎగసి పడుతుంటే లంగా ఓణీ కట్టుకుని ఒడ్డున కూర్చుని ప్రశాంతంగా నవ్వుతోంది జాన్వీ. లంగాఓణీలో జాన్వీ చాలా అందంగా కనిపిస్తోంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుంది.