
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు 'ఓజీ' రొమాంటిక్ సాంగ్ సర్‌ప్రైజ్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ (OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఆయన బర్త్‌డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రొమాంటిక్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. గతేడాది పవన్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన 'హంగ్రీ చీతా' గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈసారి మాత్రం రొమాంటిక్ సాంగ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
Details
ఓజీ మూవీపై భారీ అంచనాలు
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ పాటకు అందించిన ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. థమన్ మార్క్ మెలోడీతో పాటు, పవన్ - ప్రియాంకల కెమిస్ట్రీ ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని చర్చ సాగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ముంబైలో సాగే కథలో ఈ రొమాంటిక్ ట్రాక్ ఒక ఎమోషనల్ టచ్‌ను జోడిస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 2న ఈ సాంగ్ విడుదలైతే అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాట లాంచ్‌ను గ్రాండ్ ఈవెంట్‌గా ప్లాన్ చేస్తూ, సోషల్ మీడియాలో బిగ్ ప్రమోషన్ చేయాలని టీమ్ సన్నాహాలు చేస్తోందట.