బాలయ్య సూపర్ హిట్ 'బైరవ్ ద్వీపం' 4Kలో రీ రిలిజ్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ నటించిన ఫాంటసీ చిత్రం 'భైరవ ద్వీపం' టాలీవుడ్‌ఎవర్‌గ్రీన్ సినిమాల్లో ఒకటి.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్లాసికల్ సినిమాను ఈ తరం ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ఆగస్ట్ 5న 4K నాణ్యతతో రీరిలిజ్ చేసేందుకు క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ ప్రయత్నిస్తోంది.
అప్పట్లో సాంకేతికత అంతగా అందుబాటులో లేకపోయినా ఈ సినిమాను దర్శకులు సింగీతం విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు.
ఈ చిత్రానికి సంగీతం మాధవపెద్ది సురేష్ అందించారు. కబీర్ లాల్ కెమెరా పనితనం సినిమాకు హైలెట్.
చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై బి.వెంకటరామి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
బాలయ్య
విజయ్ పాత్రలో బాలయ్య నటన అద్భుతం
భైరవ ద్వీపం చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు శాశ్వతమైన సినిమాటిక్ అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
బాలకృష్ణ విజయ్ అనే యువరాజుగా పాత్రలో అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో కురూపి పాత్రలో బాలకృష్ణ నటన గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
బాలకృష్ణ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి రోజా(పద్మావతి)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒక దుష్ట మాంత్రికుడి నుంచి కాపాడేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశారు అనేది కథ.
అనేక మలుపుతో నిండిన ఈ కథ ఆద్యంతం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
రావి కొండలరావు రాసిన మ్యాజికల్ స్టోరీని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరపైకి తెచ్చారు.