Loading...
Kareena - Aiswarya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూపులు.. ఐశ్వర్య, కరీనా పరిస్థితి ఇదే!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూపులు.. ఐశ్వర్య, కరీనా పరిస్థితి ఇదే!

Kareena - Aiswarya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూపులు.. ఐశ్వర్య, కరీనా పరిస్థితి ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ కెరీర్ ప్రస్తుతం ఫేడవుట్ దిశగా సాగుతోందా? అంటే.. దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరోయిన్లకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడం, మార్కెట్ కూడా మునుపటిలా లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే ఐషూ.. ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేయలేదు. 'పొన్నియన్ సెల్వన్ 2' తర్వాత ఆమె వెండితెరపై కనిపించలేదు.

వివరాలు

అమె సినిమా కోసం ఎదురుచూపులు

కేన్స్ ఉత్సవాలు లేదంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తోనే ఎక్కువగా కనిపిస్తూ టైమ్ పాస్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలైన తర్వాత ఐశ్వర్యరాయ్ కూడా ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కొత్త సినిమాలతో వెండితెరపై మెరిసేవారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్ట్స్‌కి ఆమె సైన్ చేయకపోవడంతో అభిమానులు కూడా ఆమె సినిమాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మార్కెట్ కూడా ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

పెళ్లి, పిల్లలు తర్వాత కూడా వరుస అవకాశాలను అందుకుంటూ సినిమాల్లో దూసుకెళ్లిన బెబో.. ఇప్పుడు మాత్రం తన మార్కెట్‌ను కోల్పోయినట్లు కనిపిస్తోంది.

వివరాలు

'దాయ్రా' సినిమానే ఇందుకు ఉదాహరణ

కరీనా కపూర్ కెరీర్ చాలా ఏళ్లుగా డల్‌గానే సాగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'దాయ్రా' సినిమానే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం రూ.10 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

దీంతో కరీనా కపూర్ మార్కెట్‌పై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో మరికొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని టాక్ ఉంది.

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వరుసగా రావడం ఒక కారణమైతే.. వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్లు ఎంచుకోకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రస్తుతం మార్కెట్ లేదు

సీనియర్ హీరోయిన్లు కూడా తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతోనే తిరిగి బలమైన మార్కెట్‌ను సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ వంటి సీనియర్ భామల మార్కెట్ తగ్గిపోవడంతో.. వారిని ప్రధానంగా పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది.

దీంతో ప్రస్తుతం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. అప్పుడప్పుడు మాత్రమే తెరపై మెరుస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఈ భామలు మళ్లీ తమ మార్కెట్‌ను పెంచుకుని వరుస సినిమాలతో బిజీ అవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT