Orry: చిక్కుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సోషలైట్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి సమస్యల్లో చిక్కుకున్నాడు.
జమ్ముకశ్మీర్‌లోని కాట్రాలో ఉన్న పవిత్ర వైష్ణో దేవి ఆలయ సమీపంలో మద్యం సేవించి దొరికిపోయాడు.
భక్తులు ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే, ఓర్రీ తన స్నేహితులతో కలిసి అక్కడ మద్యం సేవించాడు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించి, చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
వివరాలు
పోలీసుల వివరణ
పోలీసుల వివరాల ప్రకారం,కొంతమంది అతిథులు మద్యం సేవించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
మార్చి 15న ఓర్రీతో పాటు శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ షగున్ కోహ్లీ, శ్రీమతి అనస్తాసిలా అర్జమస్కినా హోటల్ ప్రాంగణంలో మద్యం సేవించారని స్పష్టం చేశారు.
ఆ హోటల్‌లో ఆల్కహాల్, నాన్-వెజిటేరియన్ ఆహారానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
వైష్ణో దేవి ఆలయం ఒక పవిత్ర తీర్థయాత్ర స్థలం కాబట్టి ఇక్కడ మద్యం పూర్తిగా నిషేధించబడిందని గుర్తుచేశారు.
అయినప్పటికీ, వారు చట్టాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
పోలీసుల హెచ్చరిక
మతపరమైన ప్రదేశాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీయడాన్ని పోలీసులు కఠినంగా చూస్తారని హెచ్చరించారు.
మద్యం, మాదకద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ తెలిపారు.
బాలీవుడ్‌లో ఓర్రీ
ఓర్రీ బాలీవుడ్ ప్రముఖులతో ఎక్కువగా కనబడతాడు. అతను ప్రతీ వీఐపీ ఈవెంట్‌లో పాల్గొంటాడు.
ఇటీవల అనంత్ అంబానీ వివాహ వేడుకలో సందడి చేశాడు. ప్రతి ఒక్కరిని హగ్ చేసుకునే అలవాటు ఉంది.
జాన్వి కపూర్‌తో అతను చాలా సన్నిహితంగా ఉంటాడు. టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో కూడా అతను కనిపించాడు. హై-ప్రొఫైల్ పార్టీలు, ఈవెంట్లలో తరచుగా హాజరవుతాడు.