Oscar Awards: అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు.. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'కు ఆరు అవార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి అట్టహాసంగా సాగింది. లాస్ ఏంజెలెస్‌లోని ప్రతిష్ఠాత్మక డాల్బీ థియేటర్‌లో ఈ వైభవమైన కార్యక్రమం నిర్వహించారు. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డును భారతీయ నటి ప్రియాంక చోప్రా ప్రకటించి అందజేశారు. ఈ ఏడాది 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', 'సిన్నర్స్' చిత్రాలు అవార్డుల పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' సినిమా ఏకంగా ఆరు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్) ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్) ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాప్ డిమాన్ హంటర్స్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టైయిన్
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్ ఉత్తమ సౌండ్: ఎఫ్ 1 ఉత్తమ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
వివరాలు
ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నసినిమాలు ఇవే..
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్) ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైయిన్