NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..
    ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..

    Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మే చివరి వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

    ముఖ్యంగా 5 చిత్రాలపై ఫోకస్ ఎక్కువగా ఉంది. వీటిలో నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు, సూర్య నటించిన చిత్రం, ఓ కన్నడ సినిమా, ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఓ స్పానిష్ డ్రామా ఉన్నాయి.

    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఈ టాప్ 5 సినిమాలపై ఓ లుక్కేయండి.

    వివరాలు 

    హిట్ 3 

    నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3' మే 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రాబోతుంది.

    తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది.

    శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలై, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

    నానికి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. మే 29 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

    వివరాలు 

    అజ్ఞాతవాసి 

    కన్నడలో తెరకెక్కిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'అజ్ఞాతవాసి' మే 28న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించనుంది.

    రంగనాయన రఘు, పావన గౌడ లీడ్ రోల్స్ పోషించిన ఈ చిత్రానికి జనార్దన చిక్కన్న దర్శకత్వం వహించారు.

    ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా మే 28 నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

    వివరాలు 

    రెట్రో

    తమిళ నటుడు సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన 'రెట్రో' సినిమా మే 31న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

    రొమాంటిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.

    మే 1న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, చివరికి సూపర్ హిట్‌గా నిలిచింది.

    గ్యాంగ్‌ల మధ్య కక్షలు, ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

    మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లభించనుంది.

    వివరాలు 

    కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్ 

    హాలీవుడ్‌లోని పాపులర్ సూపర్ హీరో సిరీస్‌కు చెందిన 'కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్' మే 28న జియోసినెమా (హాట్‌స్టార్) ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‌కు రాబోతుంది.

    ఇప్పటి వరకు కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్లలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ స్ట్రీమింగ్‌గా అందుబాటులోకి రానుంది.

    ఆంటోనీ మాకీ, డానీ రెమీరెజ్, షిహా హాస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జూలియస్ ఓనాహ్ దర్శకత్వం వహించారు.

    ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది.

    వివరాలు 

    ఏ విడోస్ గేమ్ 

    స్పెయిన్ దేశానికి చెందిన క్రైమ్ డ్రామా చిత్రం 'ఏ విడోస్ గేమ్' మే 30న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ స్ట్రీమింగ్‌కి రానుంది.

    ఇవానా బకెరో, ట్రిస్టన్ ఉలావీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించారు.

    ఈ మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. మిస్టరీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం ఓటీటీలో ప్రీమియంగా నిలవనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి

    తాజా

    Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే.. ఓటిటి
    PBKS vs MI : ముంబైతో కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గ‌ట్టి షాక్  ఐపీఎల్
    Monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు! నైరుతి రుతుపవనాలు
    US: సౌత్ కరోలినా లిటిల్‌ రివర్‌ ప్రాంతంలో కాల్పుల కలకలం.. 11 మందికి తీవ్ర గాయలు  అమెరికా

    ఓటిటి

    Zebra Movie: ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్‌ 'జీబ్రా'.. ఎక్కడంటే? ఆహా
    OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు  కేంద్ర ప్రభుత్వం
    Vidudala 2: 'ఓటిటి వేదికపై 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌.. ప్రేక్షకుల కోసం కొత్త అనుభవం! సినిమా
    upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025