
OTT releases this week: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
OTT releases this week: ఈ వారం థియోటర్లలో పలు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.
అలాగే, చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష హీరోగా నటించిన సినిమా 'సుందరం మాస్టర్' (Sundaram Master).
ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్‌లో విడుదల కానుంది. ఈ మూవీకి కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు.
'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!'
అభినవ్ గోమఠం హీరోగా నటించిన చిత్రం 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!' (Masthu Shades Unnay Ra).
ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు.
ఓటీటీ
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'సైరెన్'. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
'సిద్ధార్థ్ రాయ్'
బాల నటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సిద్ధార్థ్ రాయ్'. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
ఓటీటీలో వచ్చేవి ఇవే
అమెజాన్ ప్రైమ్
అపార్ట్‌మెంట్ 404(కొరియన్ సిరీస్)-ఫిబ్రవరి 23
పోచర్-ఫిబ్రవరి 23
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
విల్ ట్రెంట్-ఫిబ్రవరి 21
మలైకోట్టై వాలిబన్-ఫిబ్రవరి 23
నెట్‌ఫ్లిక్స్
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్-ఫిబ్రవరి 22
బరీడ్ ట్రూత్-ఫిబ్రవరి 23